పకడ్బందీగా సర్వే చేపట్టాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పథకాల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్‌లో గురువారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలు నమోదు చేయొద్దన్నారు. రాళ్లు, గుట్టలు ఉన్న భూములను పరిశీలించాలన్నారు. అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. ఆత్మీయ భరోసా కింద అర్హులను గుర్తించేందుకు 2023– 24లో ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలను గుర్తించి జాబితాను గ్రామసభల్లో ప్రవేశపెట్టాలన్నారు. నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రోహిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment