పోటెత్తిన భక్తజనం
● పోతురాజు, ధర్మరాజుకు ప్రత్యేక పూజలు ● తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ఆదివాసీలు
ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
ఆలయం బయట కొబ్బరికాయలు కొడుతున్న భక్తులు
సంప్రదాయ నృత్యం చేస్తున్న మహిళలు
కెరమెరి మండలం సావర్‌ఖేడా, ఇందాపూర్ గ్రామాల సమీపంలో కొలువైన పోతురాజు ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. స్థానికులతోపాటు ఉట్నూర్, వాంకిడి, తిర్యాణి, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, నార్నూర్, ఆదిలాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని జివితి ప్రాంతం నుంచి వందలాది మంది తరలివచ్చి పోతురాజు, ధర్మరాజుకు మొక్కులు చెల్లించుకున్నారు. దేవతలకు మేకలు, కోళ్లు బలిచ్చి జెండాలు ఆవిష్కరించారు. మైసమ్మకు నూనెతో అభిషేకం చేశారు. కొలాం సంప్రదాయం ప్రకారం ఆదివాసీలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భీమదేవర, నాలుగు గోత్రాల జెండాలకు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏపీవో(పీవీటీజీ) మెస్రం మనోహర్, మాజీ ఎంపీపీ మోతీరాం, మాజీ జెడ్పీటీసీ దుర్పతబాయి ప్రత్యేక పూజలు చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై గుంపుల విజయ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సిడాం రాజు, సిడాం ధర్మూ, సిడాం చిన్నభీము, సిడాం కట్టి తదితరులు పాల్గొన్నారు. – కెరమెరి
Comments
Please login to add a commentAdd a comment