వేలంతో రూ.20.27 లక్షల ఆదాయం
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వేలం ద్వారా ఆలయానికి రూ.20.27 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో బాపిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే జాతరలో కొబ్బరికాయలు, లడ్డూ ప్రసాదం, పులిహోర విక్రయం, తైబజార్, వాహనాల పార్కింగ్, కొబ్బరిముక్కలను పోగు చేయడానికి గురువారం ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించారు. టెంకాయ విక్రయం కోసం రూ.2.38లక్షలు, లడ్డూ, పులిహోర విక్రయం కోసం రూ.4.46లక్షలు, తైబజార్ నిర్వహణకు రూ.10.92లక్షలు, వాహనాల పార్కింగ్‌కు రూ.2.21లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసేందుకు నిర్వహించిన వేలం ద్వారా రూ.30వేల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గతేడాది వేలం ద్వారా ఆలయానికి రూ.16.93లక్షల ఆదాయం రాగా, ఈసారి రూ. 3.34 లక్షలు అదనంగా రావడం విశేషం.
సర్వేతో లబ్ధిదారుల గుర్తింపు
వాంకిడి/రెబ్బెన/సిర్పూర్(టి): సర్వే ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించనున్నట్లు అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తెలిపారు. సిర్పూర్(టి) మేజర్ పంచాయతీ పరిధిలోని గోవింద్‌పూర్ కాలనీ, వాంకిడి మండలం, రెబ్బెన మండలం కైరిగాంలో గురువారం సర్వేను పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి వివరాలు తెలుసుకున్నా రు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందాలన్నారు. దరఖాస్తుదారుల వివరాలతో జాబితా రూపొందించి గ్రామ స భల్లో చర్చించాలని ఆదేశించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూముల జాబితా తయారు చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, తహసీ ల్దార్లు రామ్మోహన్‌రావు, రియాజ్ అలీ, శ్రీని వాస్, మండల వ్యవసాయ అధికారి దిలీప్, ఎంపీవో జావిద్, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు మీనాక్షి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment