● గుక్కెడు నీటి కోసం..
తాగేందుకు గుక్కెడు నీరు లేక అవస్థలు పడుతున్నామని, పట్టించుకునే వారు కరువయ్యారని ఆగ్రహిస్తూ తిమ్మాపురంలోని మహిళలు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉంటుందని, ఇక్కడి వారంతా చిన్నసన్నకారు రైతులన్నారు. 20 ఏళ్లుగా గ్రామానికి తాగునీటి సరఫరా లేక బోరు పంపు నీటితో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు నీటిని తాగటం వల్ల ఎక్కువ శాతం మంది కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమకు మంచినీటి సదుపాయం కల్పించాలని విన్నవించారు. – తిమ్మాపురం(వీరులపాడు)
Comments
Please login to add a commentAdd a comment