డీఆర్‌ఎం కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో డీఆర్‌ఎం కప్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారం రైల్వే స్టేడియంలో ప్రారంభమయ్యాయి. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ హాజరై క్రికెట్ పోఈలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఓవర్ల ఫార్మెట్‌లో లీగ్ దశ పోటీలు ఈనెల 20వ తేదీ వరకు జరుగుతుండగా, 15 విభాగాల క్రీడాకారులు పాల్గొనున్నట్లు చెప్పారు. అందులో ఉత్తమ ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను జోనల్, జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లకు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. భారతీయ రైల్వేలో యువతలోని ప్రతిభను బయటకు తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం కొద్ది సేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో సీనియర్ డీఎస్‌సీ, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ వల్లేశ్వర బీ,టీ, సీనియర్ డీఈఎన్ ఎస్.వరుణ్‌బాబు, సీనియర్ డీఎంఈ సంజయ్ అంగోతు, ఏఎస్‌సీ జి.మధుసూదన్‌రావు, పలు బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment