మరో గ్రంథాలయ ఉద్యమం తప్పదు
అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎందరో మహనీయుల ఉద్యమం, త్యాగాల ఫలితంగా సాధించుకున్న గ్రంథాలయ వ్యవస్థ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో గ్రంథాలయ ఉద్యమం చేపట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో రచయితలు, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, పుస్తక ప్రచురణకర్తలు కలిసి శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల తెలుగు తల్లికి పూల దండ వేసి ప్రదర్శన నిర్వహించారు. కార్ల్ మార్క్స్ రోడ్, బీసెంట్ రోడ్ మీదుగా గాంధీనగర్‌లోని లెనిన్ విగ్రహం ఉన్న పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పెనుగొండ లక్ష్మీ నారాయణ మాట్లాడారు. ముస్లిం, హిందు, క్రైస్తవుల కోసం మసీ దులు, దేవాలయాలు, చర్చిలు ఉన్నట్లు విద్యా ర్థుల జ్ఞానం కోసం గ్రంథాలయాలు అవసరమని అన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ.. 1914లో విజయవాడ నుంచే గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైందని, అదే స్ఫూర్తితో ఇక్కడ నుంచే పునర్వికాస ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వివిధ సంఘాల ప్రతినిధులు పిన్నమ నేని మురళీకృష్ణ, అక్కినేని వనజ, గోళ్ల నారాయణరావు, చలపాక ప్రకాష్, సింగంపల్లి అశోక్ కుమార్, వెంకట నారాయణ, వర ప్రసాద్, గుత్తికొండ లక్ష్మి, చందు నాగేశ్వరరావు, ఎం.లక్ష్మయ్య, టి.మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment