లోక్ అదాలత్‌లో 10,762 కేసుల పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్‌అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వరం న్యాయం అందించేందుకు తాము లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తు న్నట్లు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను అన్ని కోర్టుల్లో నిర్వహించారు. ఈ కోర్టుల్లో శనివారం రాత్రికి 10,762 కేసులు పరిష్కరించి రూ.26.97 కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. వీటిలో సివిల్ కేసులు 341, క్రిమినల్ కేసులు 10,266, ప్రీలిటిగేషన్ కేసులు 155 పరిష్కరించారు. మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు సంబంధించిన కేసులో బాధితులకు రూ.10.10 లక్షల చెక్కును జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అందజేశారు. జిల్లాలోని మచిలీపట్నంలోని బెంచ్‌లలో 1,210, ఉయ్యూరు 333, మొవ్వ 409, గుడివాడ 1,563, అవనిగడ్డ 195, గన్నవరం 245, బంటుమిల్లి 74, విజయవాడ 2,489, నందిగామ 344, తిరువూరు 739, జగ్గయ్యపేట 1861, మైలవరం 245, నూజివీడు 387, కైకలూరులో 668 కేసులను పరిష్కరించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.వి.రామకృష్ణయ్య పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ప్రధాన
న్యాయమూర్తి అరుణసారిక
Comments
Please login to add a commentAdd a comment