రైతులకు అండగా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఆందోళనబాట పట్టింది. ధాన్యం కొనుగోలు, గిట్టుభాటు ధర, ఇచ్చిన హామీల అమలు కోసం శుక్రవారం నిరసన కార్యక్రమాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంతో జిల్లాలోని నేతలు, కార్యకర్తలు, రైతులు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉదయం 10:30గంటలకు బందరు ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లి ధర్నా నిర్వహిస్తారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందిస్తారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఓ ప్రకటనలో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment