అప్పులతో అన్నం! | - | Sakshi
Sakshi News home page

అప్పులతో అన్నం!

Published Tue, Dec 17 2024 7:28 AM | Last Updated on Tue, Dec 17 2024 7:28 AM

అప్పు

అప్పులతో అన్నం!

బిల్లులకు సున్నం..
‘నాలుగు నెలలుగా మెస్‌ బిల్లులు మంజూరు కాలేదు. పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. అదిగో.. ఇదిగో ప్రభుత్వం నుంచి వస్తాయంటున్నారు. అయితే హాస్టల్‌లో చదువుకునే పిల్లలను పస్తులు పెట్టలేం. మా హాస్టల్‌లో వంద మంది విద్యార్థులున్నారు. వీరికి మెనూ ప్రకారం భోజనం పెట్టేందుకు రోజుకు రూ.5,200, నెలకు రూ.1.56లక్షలు అవుతుంది. నాకొచ్చే జీతం నా కుటుంబ పోషణకే సరిపోతుంది. హాస్టల్‌ పిల్లల బాధ్యత నా పైనే ఉండడంతో రూ.3లక్షలు అప్పు చేశా. అయినా చాలకపోవడంతో ఇటీవలే ఐదు తులాల బంగారు నగలు తాకట్టు పెట్టా. అయితే ప్రభుత్వం నుంచి బిల్లు పెట్టిన వాటికే డబ్బులు వస్తాయి. మరి నేను చెల్లిస్తున్న వడ్డీ మాటేమిటి? ఎంత కాలం ఇలా నెట్టుకు రావాలో తెలియడం లేదు.’ ఇదీ ఓ వసతి గృహ అధికారి ఆవేదన.

సాక్షి, మచిలీపట్నం: ప్రభుత్వ హాస్టళ్లలో సంక్షేమం సన్నగిల్లింది. సర్కారు నిర్లక్ష్యంతో విద్యార్థులతో పాటు వసతి గృహాల వార్డెన్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెస్‌ బిల్లులు అందక ఉద్యోగులు, కాస్మొటిక్‌ చార్జీలు మంజూరు కాక తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

హాస్టళ్లలో విద్యార్థులు..

జిల్లాలో మొత్తం 83 సంక్షేమ హాస్టళ్లు ఉండగా 4,656 మంది వసతి పొందుతున్నారు. ఇందులో 40 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 2,485 మంది, బీసీ సంక్షేమ హాస్టళ్లలో 2,171 మంది ఉన్నారు. మొత్తం అబ్బాయిలు 2,262 మంది, బాలికలు 2,394 మంది వసతి పొందుతున్నారు.

అప్పు చేసి హాస్టల్‌ కూడు..

విద్యార్థుల మెస్‌ బిల్లులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గత నాలుగు నెలలుగా ఒక్కో హాస్టల్‌కు రూ.లక్షల్లో బిల్లులు ఉన్నా.. రూపాయి కేటాయించలేదు. ఒక్కో విద్యార్థికి మూడు పూటలు తిండి, స్నాక్స్‌ పెట్టాలి. ఈ సమస్య బీసీ సంక్షేమంతో పాటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉందని, విద్యార్థులను పస్తులు ఉంచలేక తాము అప్పులు చేసినట్లు కొందరు, బంగారం తాకట్టు పెట్టినట్లు మరికొందరు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే, అప్పుల బాధతో కొందరు వార్డెన్లు మెనూ పాటించకుండా.. నాసిరకం వంటలతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది.

రూ.6 కోట్లకు పైగా బిల్లులు..

జిల్లాలో మెస్‌ బిల్లులు రూ. కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. సాంఘిక సంక్షేమంతో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమంలో మొత్తం 4,656 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య, పాఠశాల, కళాశాల విద్యార్థులను బట్టి, కాస్మోటిక్‌ చార్జీలు కలిపి సుమారు రూ.6కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగు నెలలుగా సంక్షేమ హాస్టళ్లకు విడుదల కాని మెస్‌ బిల్లులు అప్పులు చేసి వంటలు చేస్తున్న హాస్టళ్ల సంక్షేమాధికారులు విద్యార్థులకు అందని కాస్మొటిక్‌ చార్జీలు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

హాస్టళ్లలో కనపడని సం‘క్షేమం’

బిల్లులను వెంటనే విడుదల చేయాలి..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పెండింగ్‌ మెస్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల కొందరు వసతి గృహ సంక్షేమాధికారులు మెనూ పాటించడం లేదు. ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యత. మెస్‌ బిల్లులతో పాటు కాస్మోటిక్‌ చార్జీలను కూడా విడుదల చేయాలి. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతాం.

– ఎస్‌. సమరం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

ప్రతిపాదనలు పంపాం..

జిల్లాలోని వసతి గృహాల బిల్లులు విడుదల చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. సెస్టెంబర్‌ వరకు బిల్లులు వచ్చాయి. అక్టోబరు నుంచి రావాల్సి ఉంది. నిధులు విడుదలైతే.. వెంటనే మంజూరు చేస్తాం.

– షాహిద్‌బాబు, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
అప్పులతో అన్నం! 1
1/4

అప్పులతో అన్నం!

అప్పులతో అన్నం! 2
2/4

అప్పులతో అన్నం!

అప్పులతో అన్నం! 3
3/4

అప్పులతో అన్నం!

అప్పులతో అన్నం! 4
4/4

అప్పులతో అన్నం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement