చేతి రాత పోటీలతో విద్యార్థులకు మేలు
మచిలీపట్నంటౌన్: రైటింగ్ ప్రాక్టీస్ తగ్గుతున్న పరిస్థితులలో హ్యాండ్ రైటింగ్ పోటీలు విద్యార్థుల్లో ఆసక్తిని, స్ఫూర్తిని కలిగిస్తాయని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయస్థాయి చేతిరాత పోటీల్లో పాల్గొన్న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ పాఠశాలల చెందిన ఐదుగురు విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి చేతి రాతతో పాటు వేగంగా రాయడం, రాసింది అర్థమైనప్పుడే విజయం సాధిస్తారన్నారు. పోటీ పరీక్షల్లో ఐదు నిమిషాల్లో ఒకటిన్నర పేజీలు రాయాల్సి ఉంటుందని అన్నారు. బాల్యంలోనే చేతిరాత పట్ల ఆసక్తి కలిగి నేర్చుకోవడం చాలా సంతోషమన్నారు. మీ చేతి రాత లాగానే మీ భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాను ఐఏఎస్ పరీక్షలు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ క్లాసులకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అఖిలభారత చేతి రాత అండ్ గ్రాఫాలజీ అసోసియేషన్ కార్యదర్శి పి. భువనచంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
వెండి నాగపడగ బహూకరణ
మోపిదేవి: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి కై కలూరుకు చెందిన ఎన్.సాయికృష్ణ, శ్రీదేవి దంపతులు 428 గ్రాముల బరువున్న వెండి నాగపడగను అందజేశారు. ఆలయంలో సాయికృష్ణ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారికి నాగ పడగను అందించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment