వీరాంజనేయుని హుండీ ఆదాయం రూ.6.18లక్షలు
పామర్రు: మండలంలోని ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.6,18,069 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీఎస్‌వీ ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక ఆలయంలో సోమవారం హుండీలోని కానుకలను లెక్కించారు. ఆయన మాట్లాడుతూ భక్తులు 90రోజుల పాటు హుండీలో వేసిన కానుకలను గుడివాడ తనిఖీ అధికారి వి. సుధాకర్ ఆధ్వర్యంలో లెక్కించామన్నారు. ఈ లెక్కింపులో పై ఆదాయంతో పాటు 0.620 గ్రాముల వెండి, 1.140 గ్రాముల బంగారం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఉండ్రపూడి మాజీ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, దాడి పవన్‌లు లెక్కింపులో పాల్గొన్నారు.
వేలం వాయిదా..
స్వామివారికి సమర్పించే కొబ్బరి చెక్కలు, పటిక బెల్లం, తలనీలాలు పోగు చేసుకునే లైసెన్సు హక్కునకు పాట దారులు ఎవ్వరూ రానందున వేలంను వాయిదా వేసినట్లు ఈవో చెప్పారు.
సరిహద్దు
దాటితే సీజ్ చేస్తాం
గండ్రాయి(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామం వద్ద ఏపీ, తెలంగాణ సరిహద్దులోని వల్లభి చెక్‌పోస్టు వద్ద ఏపీ ధాన్యం లారీలను రెండో రోజూ తెలంగాణ పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖాధికారులు నిలిపివేశారు. సోమవారం ఏపీకి చెందిన సుమారు 30 ధాన్యం లారీలు తెలంగాణ వెళ్లకుండా వెనుదిరిగాయి. రెండు రోజులుగా సరిహద్దు వద్ద లారీలు నిలిపివేసిన డ్రైవర్లు అను మతి కోసం ఎదురుచూశారు. లారీల్లోనే వంటావార్పు కూడా చేసుకున్నారు. ఉదయం సమయంలో మరోమారు తెలంగాణలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. శిస్తు చెల్లిస్తున్నామని, ధాన్యానికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయని, అనుమతించాలంటూ వేడుకున్నప్పటికీ ఫలి తం లేకుండా పోయింది. లారీలు తెలంగాణలోకి వస్తే సీజ్ చేస్తామని హెచ్చరించడంతో చేసేది లేక లారీలు ఏపీకి వెనుదిరిగాయి.
పెన్షనర్లు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లో పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఉపయోగపడుతున్నాయని ఏడీఆర్‌ఎం పీఈ ఎడ్విన్ అన్నారు. సోమవారం విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పెన్షన్ అదాలత్–2024 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏడీఆర్‌ఎం ఎడ్విన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం మాట్లాడుతూ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, సెటిల్‌మెంట్ బకాయిలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు అదాలత్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ డీపీఓ కట్టా ఆనంద్ మాట్లాడుతూ అదాలత్‌లో మొత్తం 92 ఫిర్యాదులు నమోదు కాగా మూడు కేసులను అక్కడికక్కడే పరిష్కరించి రూ. 7,48,408 పెన్షన్ దారులకు అందజేశామన్నారు. స్నేహ హస్తం, పీ–ఎంజీ ఆర్‌ఎస్, అభిలాష వంటి ప్రత్యేక ప్లాట్‌ఫాంల ద్వారా పెన్షన్‌దారుల సమస్యలను పరిష్కరిస్తున్న పర్సనల్ బ్రాంచ్, అకౌంట్స్ బ్రాంచ్ అధికారులను పెన్షనర్ సంఘాలు, అసోసియేషన్ నేతలు ప్రశంసించారు. సీనియర్ డీఎఫ్‌ఎం వై.సందీప్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల శాఖ(ట్రెజరీ, అకౌంట్స్) ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా గోవిందు రవికుమా ర్, ప్రధాన కార్యదర్శిగా కాజ రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతి లో రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగస్తుల ఆత్మీయ సమావేశంలో ఎన్నుకున్న కొత్త కార్యవర్గంలో సహాధ్యక్షుడిగా కె. శ్రీనివాసరావు (గుంటూరు), కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.శ్రీనివాసరావు (ఎన్టీఆర్), కార్యదర్శిగా సీహెచ్ అనురాధ (ఎన్టీఆర్), కోశాధికారికా ఎల్‌వీ యుగుంధర్ (విజయనగరం)లతో పాటు ఏడుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment