దీక్షాతోరణం | - | Sakshi
Sakshi News home page

దీక్షాతోరణం

Published Tue, Dec 17 2024 7:28 AM | Last Updated on Tue, Dec 17 2024 7:28 AM

దీక్ష

దీక్షాతోరణం

పెనుగంచిప్రోలు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్‌ 25న తెల్లవారుజామున ఆలయంలో ప్రారంభం కానుంది. ఈ దీక్షను ఆలయంలో మొదటి సారిగా 1990లో ప్రారంభించారు. రాష్ట్రంలో శబరిమలలో కొలువై ఉన్న శ్రీఅయ్యప్పస్వామి, విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీకనకదుర్గమ్మవారి భవానీ మాల అనంతరం ఎక్కువ మంది భక్తులు శ్రీతిరుపతమ్మవారి మాల వేసుకుంటున్నారు. మొదట 34ఏళ్ల క్రితం కేవలం 46 మందితో దీక్ష ప్రారంభం కాగా, ఏడాదికేడాది పెరుగుతూ ప్రస్తుతం ఏటా 20 నుంచి 25 వేల మంది భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మాల వేసుకుంటున్నారు. మొదటసారిగా అర్చకుడు దివంగత మర్రెబోయిన రామదాసు గ్రామపెద్దలు, ఆలయ అధికారులు, వామకుంట్ల పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులు సమక్షంలో అమ్మవారి సన్నిధిలో మాల వేసుకున్నారు. గతంలో పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధిలోనే స్వాములు మాల వేసుకొని దీక్షలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు గురుస్వాములు వారి గ్రామాల్లోనే మాలలు వేస్తున్నారు. అయితే దీక్ష అనంతరం తిరుముడి సమర్పణకు మాత్రం పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధికి తప్పక వస్తారు. గతంలో మండల దీక్ష, అర్ధమండల దీక్ష మాత్రమే ఉండగా.. ఈ ఏడాది కొత్తగా 11 రోజుల దీక్ష కూడా ఆలయ వర్గాలు ఏర్పాటు చేశాయి.

ఈ ఏడాది దీక్షల షెడ్యూల్‌ ఇదీ..

ఆలయంలో మండల దీక్ష మాల ధారణ ప్రారంభం: 25–12–2024

మాల ధారణ ముగింపు: 31–12–2024

అర్ధమండల దీక్ష ప్రారంభం: 18–01–2025

మాల ధారణ ముగింపు: 21–01–2025

11రోజుల దీక్ష ప్రారంభం: 27–01–2025

మాల ధారణ ముగింపు: 31–01–2025

దీక్షల విరమణ: 11–02–2025

25 నుంచి తిరుపతమ్మవారి

మండల దీక్షలు ప్రారంభం

దీక్ష తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది..

మొదట 46 మందితో ప్రారంభమైన అమ్మవారి మండల దీక్ష మాల ధారణ ప్రస్తుతం 25 వేలకు పైగా పెరిగింది. మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో వేల సంఖ్యలో అమ్మవారి దీక్షలు తీసుకుంటున్నారు. దీక్ష తీసుకునేవారు ఆలయానికి వచ్చేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి, మాలలు, టికెట్టు తీసుకొని రావాలి. అమ్మవారు భక్తులు అందరినీ చల్లగా చూస్తారు. స్వాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న దీక్షల విరమణ చేస్తారు.

– మర్రెబోయిన గోపిబాబు, ఆలయ ప్రధానార్చకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
దీక్షాతోరణం1
1/2

దీక్షాతోరణం

దీక్షాతోరణం2
2/2

దీక్షాతోరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement