ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి

Published Tue, Dec 17 2024 7:28 AM | Last Updated on Tue, Dec 17 2024 7:29 AM

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి

మచిలీపట్నంటౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని, జిల్లా, డివిజన్‌, మండల, మునిసిపాలిటీ స్థాయిల్లో మరింత ఉత్సాహంగా పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం డీఆర్వో అధ్యక్షతన మీకోసం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి మెరుగైన సేవలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతి సోమవారం మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించే మీకోసంనకు వివిధ శాఖల మండల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కింది స్థాయిల్లోనే పరిష్కరిస్తే కలెక్టరేట్‌ వరకు అర్జీదారులు రావాల్సిన అవసరం రాదన్నారు. వివిధ శాఖల్లో కోర్టు కేసులు మానిటర్‌ చేయడానికి కలెక్టరేట్‌లో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్వో తెలిపారు. మొత్తం 102 అర్జీలు వచ్చాయన్నారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె. స్వాతి డీఆర్వోతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమణారావు, ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌. సువర్ణ, డీసీహెచ్‌ఎస్‌ ఎం. జయకుమార్‌, సర్వే ఏడీ జోషీల పాల్గొన్నారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

● గుడివాడకు చెందిన శంభంగి శివరంజని తన కూతురు భవ్య శ్రీ (19)కి వికలాంగుల పింఛన్‌ నెలకు రూ. 6 వేలు ఇస్తున్నారని తెలిపారు. కానీ భవ్యశ్రీ మంచానికే పరిమితమైనందున రూ. 15 వేల పింఛన్‌ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

● ఘంటసాల మండలం తెలుగురావు పాలెం రైతు సేవా కేంద్రం పరిధిలో ఈ–క్రాప్‌ అయినట్లు తనకు ఫోన్‌లో మెసేజ్‌ వచ్చిందని, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్తే ఈ క్రాప్‌ కాలేదని, తన పేరు లేదంటున్నారని అచ్చంపాలెం గ్రామానికి చెందిన గాజుల లీన సాయి ప్రియ తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.

● 2015లో కప్పలదొడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు చేనేత కార్మికులకు ఇంత వరకు ఎక్స్‌గ్రేషియా అందలేదని, వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని కోరుతూ పేరిశెట్టి విఘ్నేశ్వరరావు అర్జీ సమర్పించారు.

‘మీకోసం’లో డీఆర్వో చంద్రశేఖరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement