తెలుగు సాంస్కృతిక ఉద్యమానికి బసవపున్నయ్య విశేష కృషి
కృష్ణలంక(విజయవాడతూర్పు): తెలుగు సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకినేని బసవపున్నయ్య విశేష కృషి చేశారని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ బీవీ రాఘవులు అన్నారు. నేడు దేశంలో సాంస్కృతిక సంఘర్షణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవ పున్నయ్య 112వ జయంతి సందర్భంగా ఎంబీ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన సోమవారం సాంస్కృతిక వైవిద్యం–దేశ సమైక్యత అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథి రాఘవులు బసవపున్నయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాంస్కృతిక ఉద్యమం ఏ సమాజ మార్పుకై నా సహాయం చేస్తుందన్నారు. ఫ్రెంచ్ విప్లవంలో, సోషలిస్టు ఉద్యమంలో గొప్ప నాటక కర్తలు, సాహిత్యకారులు, గొప్ప రచయితలు ఉద్భవించినట్లే మన జాతీయోద్యమంలో కూడా గొప్ప రచయితలు, సాహిత్యకారులు ఉద్యమించారన్నాన్నారు. దేశ సమైక్యత, సమాజం ముందుకు పోవడానికి ప్రాతిపదిక లౌకికవాదం అన్నారు. ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు వివరించారు. 2024 సంవత్సరంలో నిర్వహింంచిన కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment