ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక

Published Fri, Dec 20 2024 1:25 AM | Last Updated on Fri, Dec 20 2024 1:25 AM

ఎన్టీ

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక

విజయవాడస్పోర్ట్స్‌: జాతీయ అంతర విశ్వ విద్యాలయాల పురుషుల ఫుట్‌బాల్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్‌ త్రిమూర్తి తెలిపారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు కాలికట్‌ విశ్వవిద్యాలయంలో జరిగే అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. క్రీడాకారులు జస్వంత్‌, వివేక్‌, రామాంజనేయులు, జమీల్‌ అక్తర్‌, హేమంత్‌, రుక్మందర్‌ సాయి, క్రిస్టిమాథ్యూ, అహ్మద్‌, భావిష్‌, క్రాంతికుమార్‌, నీరజ్‌ చంద్ర, జాషువా, మోసెస్‌ పీటర్‌, సుధీర్‌, జిబిన్‌, చరణ్‌ జట్టుకు ఎంపికై నట్లు వెల్లడించారు. జట్టు బృందాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో వర్సిటీ వీసీ డాక్టర్‌ డి.ఎస్‌.వి.ఎల్‌. నరసింహారావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి. రాధికా రెడ్డి గురువారం అభినందించారు.

ధాన్యం లారీలు నిలిపివేత

అన్నవరం(జగ్గయ్యపేట): గ్రామంలోని తెలంగాణ సరిహద్దు వద్ద గురువారం ఏపీకి చెందిన ధాన్యం లారీలను నిలిపివేశారు. ఏపీలోని గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 30 ధాన్యం లారీలు గ్రామం మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ–సూర్యాపేటకు వెళ్లేందుకు వచ్చాయి. దీంతో గ్రామ సమీపంలోని తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్దకు వచ్చేసరికి ఏపీ లారీలకు అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లాలని కోదాడ పోలీసులు, పౌర సరఫరాల శాఖాధికారులు కోరారు. దీంతో లారీ డ్రైవర్లు వాహనాలను అక్కడే 3 గంటల పాటు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న జగ్గయ్య పేట ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ మనోహర్‌ అక్కడకు చేరుకుని లారీ రికార్డులను పరిశీలించి మార్కెట్‌ కమిటీ అనుమతులు లేవని చెప్పడంతో లారీ డ్రైవర్లు వెనక్కి వెళ్లిపోయారు.

నాణ్యమైన విద్య

అందరికీ అందాలి

కంకిపాడు: నాణ్యమైన విద్య అందరికీ అందా లని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు అన్నారు. ఈడుపుగల్లు జిల్లా పరిషత్‌ పాఠశాలలో డీఆర్పీ, కేఆర్పీలకు ఉద్దేశించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు బోధన జరగాలన్నారు. సమగ్ర మూల్యాంకనం దిశగా మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయస్సు గల చిన్నారులకు భాష, గణితం, ప్రాథమిక భావనలు, అక్షరాలు, పదాలు, వాక్యాలు, కథలు నేర్పించటం వంటివి నేర్పటం ద్వారా విద్య పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డైట్‌ లెక్చరర్‌ శ్రీహరికిరణ్‌, ఎంఈఓ–1 శేషగిరిరావు, ఎంఈఓ–2 కేవీఎస్‌ ప్రసాద్‌, హెచ్‌ఎం పద్మావతి, ఎంఆర్‌సీలు పాల్గొన్నారు. జిల్లాలోని ఎస్‌జీటీలు, అంగన్‌వాడీ సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు.

నేడు సీఎం చంద్రబాబు పర్యటన

కంకిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న పెనమలూరు నియో జకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను గురువారం కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్‌రావు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా గంగూరులో హెలీప్యాడ్‌, రైతు సేవా కేంద్రం, ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు వెంకటాద్రి రైస్‌మిల్లు ప్రాంతాలను పరిశీలించారు. ఈడుపుగల్లు బీసీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం చంద్రబాబు పాల్గొననుండటంతో సభా ఏర్పాట్లను తనిఖీ చేశారు. పర్యటనలో జేసీ గీతాంజలి శర్మ పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ  ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక 
1
1/3

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ  ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక 
2
2/3

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ  ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక 
3
3/3

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌ బాల్‌ జట్టు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement