![వివరాలు వెల్లడిస్తున్న
ట్రైనీ డీఎస్పీ రఘువీర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/22/21ndl30-200100_mr_0.jpg.webp?itok=DWO0zk_W)
వివరాలు వెల్లడిస్తున్న ట్రైనీ డీఎస్పీ రఘువీర్
బొమ్మలసత్రం: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బిల్లు రికవరీ పేరుతో ఉమ్మడి జిల్లాలో 19 మంది కస్టమర్ల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి పరారైన సంఘటన గురువారం కలకలం రేపింది. ట్రైనీ డీఎస్పీ రఘువీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన వసీమ్ అలీబేగ్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో క్రెడిట్ కార్డ్ రీకవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. కాగా కస్టమర్ల క్రెడిట్ కార్డు బిల్లులు తన సొంత అవసరాలకు వాడుకోవటంతో బ్యాంక్ అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. అయినప్పటికీ తాను ఇంకా రీకవరీ ఏజెంట్‌గా ఉద్యోగంలో ఉన్నానని చెప్పి ఉమ్మడి జిల్లాలో ఉన్న 19 మంది కస్టమర్ల నుంచి రూ.6 లక్షల దాకా వసూలు చేశాడు. కాగా వారి వద్దకు రికవరీ కోసం వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి క్రెడిట్ కార్డు బకాయి నగదును వసీమ్ అలీ బేగ్ అనే వ్యక్తికి చెల్లించామని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. నిందితుని ఇంటి వద్దకు వెళితే ఇంటికి తాళం వేసి పరారయ్యారని గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై గురువారం చీటింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్నామని ట్రైనీ డీఎస్పీ వివరించారు. ఎవరైనా బ్యాంక్ సిబ్బంది పేరుతో ఫోన్ చేసి బకాయిలు కట్టాలని అడిగితే బ్యాంక్‌కు వెళ్లి సదరు వ్యక్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే బకాయిలు చెల్లించాలని కోరారు.
● రికవరీ ఏజెంట్‌నంటూ రూ. 6 లక్షలు వసూలు చేసి పరారీ
Comments
Please login to add a commentAdd a comment