దాతృత్వ ధీరుడికి అక్షర నివాళి | - | Sakshi
Sakshi News home page

దాతృత్వ ధీరుడికి అక్షర నివాళి

Published Fri, Oct 11 2024 2:38 AM | Last Updated on Fri, Oct 11 2024 2:38 AM

దాతృత

దాతృత్వ ధీరుడికి అక్షర నివాళి

నంద్యాల(అర్బన్‌): పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వ ధీరుడు రతన్‌ టాటాకు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ గురువారం అక్షరాలతో నివాళి అర్పించారు. ఆయన్ను స్మరించుకుంటూ ఏ3 డ్రాయింగ్‌ చార్ట్‌పై మైక్రో పెన్నుతో ఆయన స్థాపించిన పరిశ్రమలు, కల్పించిన ఉపాధి, కలిసిన మహానీయులు, దాతృత్వాల గురించి వివరిస్తూ అక్షరాలతో రతన్‌ టాటా రూపాన్ని చిత్రించారు. రతన్‌ టాటా భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో శాశ్వతంగా ఉంటారని కొనియాడారు.

పాము కాటుకు వ్యక్తి మృతి

మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామానికి చెందిన పారా రంగస్వామి (53) గురువారం తోటలో పాముకాటుకు గురై మృతి చెందాడు. వివరాలు.. పారా రంగస్వామి సాయంత్రం తోటకు వెళ్లి పనులు చేస్తుండగా కాలికి పాము కాటు వేసింది. ముల్లు గుచ్చుకుందనుకొని ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి స్పృహతప్పి పడిపోవడంతో చుట్టు పక్కల వారు వైద్య పరీక్షల కోసం గుంతకల్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతుడి భార్య సులోచన 15 ఏళ్ల క్రితమే మరణించింది. కుమారుడు విశ్వవర్ధన్‌ బీటెక్‌ చదువుతున్నారు.

బాలుడికి పాము కాటు

మిడుతూరు: స్థానిక ఎస్సీ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడికి పాము కాటు వేసింది. కోడుమూరు తాలుకా గుడూరుకు చెందిన రవికుమార్‌, సులోచన దంపతుల కుమారుడు వరుణ్‌ (3) దసరా సెలవులకు తాతగారింటికి మిడుతూరుకు మూడు రోజుల క్రితం వచ్చాడు. గురువారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా కుడి కాలికి పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకురావడంతో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్లు చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్‌ తిరుపతి తెలిపారు.

ఉరి వేసుకుని బాలింత ఆత్మహత్య

ఆదోని రూరల్‌: మండలంలోని కడితోట గ్రామంలో ఓ బాలింత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పెద్దతుంబళం పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడితోట గ్రామానికి చెందిన బోయ గీత (22)ను మంత్రాలయంకు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. గీత కాన్పు కోసం పుట్టినిల్లు కడితోట గ్రామానికి వచ్చి నాలుగు నెలల కిందట శిశువును ప్రసవించింది. తర్వాత పొత్తి కడుపులో నొప్పి తరుచూ వస్తుండేదని, ఈ విషయాన్ని భర్తకు చెప్పగా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి మునెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దాతృత్వ ధీరుడికి అక్షర నివాళి 1
1/1

దాతృత్వ ధీరుడికి అక్షర నివాళి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement