రసవత్తరంగా సాఫ్ట్‌బాల్ పోటీలు
నంద్యాల(న్యూటౌన్): నంద్యాలలోని గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నిర్వహించిన 42వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు గురువారం ముగిశాయి. శ్రీగురురాఘవేంద్ర విద్యాసంస్థలు, రామకృష్ణ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో చివరిరోజు జిల్లా ఏఎస్పీ యుగంధర్‌బాబు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు రవికృష్ణ, సాఫ్ట్‌బాల్ క్రీడా ప్రతినిధులు మౌర్య, నాగేంద్ర, విజయకుమార్, విద్యావేత్త షేక్షావలిరెడ్డితో పాటు 23 రాష్ట్రాల నుంచి ఆయా జట్ల సెక్రటరీలు పాల్గొన్నారు.అతిథులు మాట్లాడుతూ.. క్రీడాకారులు నిత్యం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అనంతరం హోరోహోరీగా సాగిన పోటీల్లో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలవగా ద్వితీయ స్థానంలో రాజస్థాన్, తృతీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విజేతగా తెలంగాణ, ద్వితీయ స్థానంలో పంజాబ్, తృతీయ స్థానంలో మధ్యప్రదేశ్ జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులతో పాటు మొమెంటోలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment