పింఛన్ ఉంటుందో..ఊడుతుందో!
● ప్రభుత్వం తనిఖీలతో సామాజిక
పింఛన్‌దారుల్లో ఆందోళన
● ఎరుకల చెర్వులో 328,
కానాలలో 416 పింఛన్ల తనిఖీ
● ఎవరెవరి పింఛన్లు తీసివేయాలనే
దానిపై అధికారులకు టీడీపీ నేతల
దిశానిర్ధేశం చేసినట్లు ప్రచారం
నంద్యాల మండలం కానాల పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల గ్రామంలో నారాయణరెడ్డి అనే పింఛన్‌దారుడికి 70 ఏళ్లు ఉన్నాయి. ఈయన పదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. సోమవారం సామాజిక పింఛన్ల తనిఖీ అధికారులు ఇంటి వద్దకెళ్లి బ్రాహ్మణపల్లె గ్రామంలో మీకు ఆరు ఎకరాల పొలం ఉందంటూ డాక్యుమెంట్లు చూపించారు. సెంటు పొలం కూడా లేదని చెప్పబోతుండగా పొలం లేనట్లుగా వన్‌బీ తీసుకొని వస్తేనే పింఛన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో దిక్కులు చూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నారాయణరెడ్డి ఒక్కడే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు పింఛన్‌దారులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలను బూచిగా చూపి పింఛన్ల ఏరివేతకు కూటమి ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment