కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని రెండు కరువు మండలాలకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ కోసం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెద్ద కడుబూరు, కౌతాళం మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్ నిర్వహించిన వ్యవసాయ శాఖ 35,041 మంది రైతులు 14999.946 హెక్టార్లలో పంటలను కోల్పోయినట్లు గుర్తించింది. బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.25.24 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపింది. కౌతాళం మండలంలో 21169 మంది రైతులు 9728.854 హెక్టార్లలో 33 శాతం కంటే ఎక్కువ స్థాయిలో పంటలను నష్టపోయారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.16.45 కోట్లు అవసరమవుతుంది. పెద్దకడుబూరు మండలంలో 13872 మంది రైతులు 5271.092 హెక్టార్లలో పంటలు నష్టపోయారు. వీరికి రూ.8.78 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. నష్టపోయిన పంటల్లో సజ్జ 62.8962 హెక్టార్లు, ఆముదం 186.6180, పత్తి 13949.2327, వేరుశనగ 745.4100, కంది 55.7894 హెక్టార్లలో ఉంది. అయితే, కరువు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయడానికి రెండేళ్ల సమయం తీసుకుంది. ఇప్పుడు కూడా అలానే చేస్తుందేమోననే భయం రైతులకు పట్టుకుంది.
రూ.25.24 కోట్లు
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వండి
ప్రభుత్వానికి నివేదిక పంపిన
జిల్లా యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment