మల్లన్న హుండీలో రూ.5.96 కోట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో ఉన్న హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రవతి కల్యాణమండపంలో లెక్కింపు చేపట్టగా 26 రోజులకు గాను మల్లన్నకు నగదు రూపేణా రూ.5,96,92,376 ఆదాయం వచ్చింది. బంగారం 232.400 గ్రాములు, వెండి 7.850 కేజీలు లభించాయి. అలాగే యూఎస్‌ఏ డాలర్లు 558, సౌదీ ఆరేబియా రియాల్స్ 3, ఓమన్ బైసా 200, కువైట్ దినార్ 12, కత్తార్ రియాల్స్ 4, సింగపూర్ డాలర్లు 7, అస్ట్రేలియా డాలర్లు 60, కెనడా డాలర్లు 35, హంకాంగ్ డాలర్లు 10, యూఏపౌండ్స్ 5, యురోస్ 115, కెన్యా సిలింగ్స్ 50, ఫిలిఫిన్స్ పిస్కో 20, యూఏఈ దిర్హామ్స్ 15, జాంబియా క్వాచా 20, జపాన్ యెన్స్ 1000 తదితర విదేశీ కరెన్సీ హుండీ లెక్కింపులో లభించింది.
Comments
Please login to add a commentAdd a comment