కుల గణన జాబితాలో ఎస్సీయేతరులను తొలగించండి
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డ్ కులాల కుల గణనకు సంబంధించి గ్రామ/వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన జాబితాల్లోని ఎస్సీయేతర కులాలను తొలగించాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సభ్యులు రమేష్‌బాబు, రవిశాస్త్రి, చిటికెల సామేల్, ఎరుకల రాజు, శాంతికుమార్, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసారపు వెంకటేష్ సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కే తులసీదేవిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు జాబితాలో మాల, మాదిగ, మాల క్రిష్టియన్, మాదిగ క్రిష్టియన్, ఆది ఆంధ్ర తదితర కులాలు కాకుండా ఎస్సీయేతర కులాలు ఉన్నాయన్నారు. తప్పుడు సమాచారంతో మదాసి కురువ, బేడ బుడగ జంగం, బరికి, పంబాల తదితర కులాల పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు పొందారని, వాటన్నింటిని గ్రామ సచివాలయాల్లో తొలగించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్ 10 కులాలను ఎస్సీ కులాల జాబితాలో నుంచి తొలగించాలని ప్రభుత్వానికి లేఖ కూడా రాశారన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment