పారిశ్రామిక రంగంలో మైనార్టీలకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) వారు మైనార్టీలకు పారిశ్రామిక అవసరాలకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నబీహా పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధి సాధించడం కోసం ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనార్టీలైన ముస్లింపులు, దూదేకుల, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పారశీకులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారికి శిక్షణతో పాటు ట్రైనింగ్ కవర్స్, ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్, కెరీర్ కౌన్సిలింగ్, యూనిఫాం, భోజన, వసతితో పాటు స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. ఆసక్తిగల వారు 0866–2571125, 8008879191ను సంప్రదించాలన్నారు.
సత్తా చాటిన
జిల్లా క్రికెట్ జట్టు
కర్నూలు (టౌన్): ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల 31 తేదీన అమలాపురంలో నిర్వహించిన అండర్–14 బాలుర క్రికెట్ అంతర్ జిల్లాల టోర్నమెంటు పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్టును గురువారం కలెక్టర్ పి.రంజిత్ బాషా తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. అలాగే పాట్నాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై న నలుగురు క్రికెట్ క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. విజేతలుగా నిలిచిన క్రికెట్ జట్టు క్రీడాకారులను జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ అభినందనలు తెలిపారు. ఈ సందరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కర్నూలు జట్టు రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. జాతీయ స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు జిల్లా కీర్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి గిడ్డయ్య, కోచ్ మేనేజర్ శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment