వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతల దాడి
మహానంది: మండలం మసీదుపురం గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తపై టీడీపీకి నాయకులు దాడి చేసిన ఘటన గురువారం రాత్రి మండలంలోని మసీదుపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన రాజేష్, ఓబులేసు, శేఖర్ తదితరులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన చిన్న దానమ్మ, పెద్ద దానమ్మ, నరసింహులు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కుటుంబసభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీకి చెందిన వారు వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్లతో దాడి చేసినట్లు గ్రామ ఎంపీటీసీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. గ్రామంలో పోలీసులు వచ్చినప్పటికీ మహిళలని చూడకుండా దాడి చేశారని, గ్రామ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశారని, గతంలోనూ వైఎస్సార్ సీపీ అభిమానులపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment