టీటీడీ ట్రస్ట్‌బోర్డులో బంజారాలకు అన్యాయం
శ్రీశైలంటెంపుల్: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో బంజారాలకు స్థానం కల్పించకుండా కూట మి ప్రభుత్వం అన్యాయం చేసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కై లాష్‌నాయక్ ఆరోపించారు. గురువారం శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు మాట్లాడే గోర్‌బోళీ భాషకు రాజ్యాంగ హోదా కల్పించేలా రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో బంజారాలకు సత్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. నూతనంగా ఏర్పడే శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో స్థానిక బంజారాలకు చోటు కల్పించాలన్నారు.శ్రీశైలంలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు స్థానిక బంజారాలకు అవకాశాలు కల్పించాలన్నారు. సమావేశంలో నాయకులు శుక్రనాయక్, హనుమాన్‌నాయక్, మల్లికార్జుననాయక్, కృష్ణానాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment