ఫిల్టర్ పైపుల ధ్వంసం
కృష్ణగిరి: మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి పొలంలో బుధవారం రాత్రి ఫిల్టర్ పైపులతోపాటు మోటర్ పైపులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత ఐదు రోజుల క్రితం కూడా ఇతని ఇంటి మీదకు అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వెళ్లగా ఆ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పొలంలోని పైపులు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలస్యంగా గుర్తించిన లక్ష్మీకాంతరెడ్డి కావాలనే కొందరు తనపై దాడులకు ఉసిగోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment