పత్తి వాహనాల బారులు
పెద్దవంగర: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని చిన్నవంగర పరిధి ఎల్బీతండాలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పారంభించారు. కాగా గురువారం కొనుగోలు కేంద్రం వద్ద వాహనాలు బారులుదీరాయి. అధికారులు చొరవ తీసుకోక పోవడంతో రైతులు సీసీఐ కేంద్రం ఎదుట వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. దీంతో తొర్రూరు–వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాలు నిలవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విక్రయాలు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పత్తి రైతులు కోరుతున్నారు.
ఉచిత చేపపిల్లలతో
ముదిరాజ్‌ల అభివృద్ధి
నెల్లికుదురు: ప్రభత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలతో ముదిరాజ్ కులస్తులు అభివృద్ధి చెందాలని జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్న అన్నారు. మండంలంలోని నెల్లికుదురు, ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం, చిన్ననాగారంతో పాటు 11 గ్రామాల్లోని 30 చెరువుల్లో 51,60,00 ఉచిత చేప పిల్లలను ముదిరాజ్‌లతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, నాయకులు యాకాంతం, శ్రీనివాస్, నర్సయ్య ముదిరాజ్‌లు గుండ వెంకన్న, యాకూబ్, ఆలి, శ్రీపతి, విష్ణు, సురేష్, సంపత్, అశోక్, వెంకన్న, సోమయ్య పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం గ్రూప్–4 ద్వారా జిల్లాకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు వెరిఫికేషన్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 71మంది అభ్యర్థులు రెవెన్యూ శాఖ కు ఎంపిక కాగా.. వారిలో 61మంది హాజరయ్యారు. వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిందని అధికారులు పేర్కొన్నారు.
క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ హాస్టళ్ల విద్యార్థులకు గురువారం జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి మాట్లాడుతూ.. వాలీబాల్, కోకో, కబడ్డీ, రన్నింగ్ తదితర క్రీడలు నిర్వహించామని, 350మంది పాల్గొన్నారని చెప్పారు. ఇందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా యువజన క్రీడల శాఖఅధికారి అనిల్, గ్రౌండవాటర్ శాఖ అధికారి సురేష్, పీడీలు, పీఈటీలు ఉన్నారు.
ఆకస్మిక సందర్శన
కేసముద్రం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మండల కేంద్రంలోని ఈజీఎంఎం, ఎంపీడీఓ కార్యాలయాలను అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈమేరకు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment