ప్రధాన వీధుల్లో పోలీసుల కవాతు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనకు మహబూబాబా ద్ జిల్లాలో ధర్నా చేపట్టడం సబబుకాదని, ఆ ఉద్దేశంతోనే మహాధర్నాకు బీఆర్‌ఎస్ నేతలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించి పోలీసు అనుమతి నిరాకరించామని తెలిపారు. రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు, భరోసా కల్పించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బీఎన్‌ఎస్‌ఎస్–163(144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామన్నారు. కవాతులో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఏఆర్, సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు.
భారీగా మోహరించిన బలగాలు
Comments
Please login to add a commentAdd a comment