ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌

Published Tue, Dec 31 2024 1:23 AM | Last Updated on Tue, Dec 31 2024 1:23 AM

ఆలయ ప

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌

వెంకటాపురం(ఎం): రామప్ప ఆలయ పరిధిలోని కామేశ్వరాలయ పునర్ని ర్మాణానికి కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సోమవారం ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. కామేశ్వరాలయ నిర్మాణ ప్రదేశం.. శిల్పాల బరువును ఎంతమేర తట్టుకుని నిలబడుతుందో తెలుసుకోవడానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌ నిర్వహించామని కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌ అజ్మీరా భీమా, డిప్యూటీ సూపరింటెండెంట్‌ చంద్రకాంత్‌, హెచ్‌ఆర్‌ దేశాయి, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌, వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు. 20 నుంచి 100 టన్నుల వరకు ఐదు దశల్లో (ఇసుకతో కూడిన సంచులు) బరువు వేసి టెస్ట్‌ చేసినట్లు వారు వెల్లడించారు.

ముగిసిన నాటక ఉత్సవాలు

హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం భీమారంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నాలుగు రోజులు నిర్వహించిన పందిళ్ల శేఖర్‌బాబు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు సోమవారం ముగిశాయి. చివరి రోజు ‘మహారాణి రుద్రమ్మదేవి చారిత్రాత్మక పద్యనాటకం’ ఆకట్టుకుంది. కాకతీయ నాటక పరిషత్‌ అధ్యక్షుడు రాజారపు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తడకమళ్ల రాంచందర్‌రావు రచనలో దేవర్రాజు రవీందర్‌రావు దర్శకత్వంలో ఈనాటకం ప్రదర్శించారు. ఈ నాటకానికి సురభి కొండల్‌రావు సంగీతం అందించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ శేఖర్‌బాబు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రదర్శించిన నాటకాలు, కళానైపుణ్యం సంజీవంగా ఉన్నాయన్నారు. కాగా, అటికం రాజమ్మ–ఎల్లగౌడ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కళాకారులకు నాలుగు రోజులు భోజన సౌకర్యం కల్పించారు. కళాకారుడు లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, జిల్లా అధ్యక్షుడు ఓడపల్లి చక్రపాణి, బాలాజీరావు, మోత్కురు మనోహర్‌రావు, శ్యాంప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు అటికం రవీందర్‌గౌడ్‌, కళాకారులు మాడిశెట్టి రమేశ్‌, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

కేయూ భూముల సర్వే

పలుచోట్ల మార్కింగ్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ సర్వే నంబర్లలోని భూముల్లో సోమవారం సర్వే నిర్వహించారు. పలివేల్పులవైపు ఉన్న 373, 414 సర్వే నంబర్లలో సర్వే నిర్వహించారు. పలు చోట్ల మార్కింగ్‌ను కూడా చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ పవన్‌, సర్వేయర్‌ రాజేశ్‌ సర్వే చేస్తున్నారు. ఈనెల 28న లష్కర్‌సింగారం కుమార్‌పల్లి 38 సర్వేనంబర్‌ భూమిలో కూడా సర్వే నిర్వహించారని కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. మరో రెండు మూడు రోజులు సర్వే కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఈ కార్యక్రమం పూర్తయి యూనివర్సిటీ భూములకు మార్కింగ్‌ పూర్తయితే క్యాంపస్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపడుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌1
1/3

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌2
2/3

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌3
3/3

ఆలయ పునర్నిర్మాణానికి ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement