షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి
మహబూబాబాద్: జిల్లాలో ఈనెల 21నుంచి 24వరకు షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం గ్రామసభల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాల అమలులో అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. గ్రామసభల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ సభల్లో ఫ్లెక్సీలు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డుపై అర్హుల జాబితాను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్లలో నమోదు చేసుకొని స్వీకరించాలన్నారు. గ్రామ సభల తీర్మాన పత్రాలను సురక్షితంగా ఎంతో జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. లబ్ధిదారులు ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అ న్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కా న్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొ ప్పో, వీరబ్రహ్మచారితో కలిసి కలెక్టర్ వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి
మరిపెడ: అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలోని పలు వార్డులు, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డ్రెయినేజీలను పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ నరేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment