విషాదంలోనూ ఔదార్యం | Sakshi
Sakshi News home page

విషాదంలోనూ ఔదార్యం

Published Thu, Apr 18 2024 9:40 AM

విష్ణు (ఫైల్‌) 
 - Sakshi

ఊట్కూర్‌: పుట్టెడు దుఃఖంలోనూ తన భర్త కళ్లను దానంచేసి ఔదార్యం చాటుకుందో భార్య. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం లయన్స్‌ క్లబ్‌ వారికి కళ్లను దానంచేసి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఊట్కూర్‌ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన దాసరి విష్ణు (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, తాను చనిపోతే తన కళ్లను ఆస్పత్రి వారికి దానం చేయాలని భార్య శశికళకు చెప్పాడు. అతడి కోరిక మేరకు రెండు కళ్లను లయన్స్‌ క్లబ్‌ వారికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement
 
Advertisement