జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రూప్–2 పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అధికారులు, గ్రూప్–2 పరీక్షల విధుల్లో ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రావొద్దని ఆమె కోరారు.
నేడు మార్కెట్‌కు సెలవు
దేవరకద్ర: మండలంలోని చిన్నరాజమూర్ జాతర సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం సెలవు ఇచ్చారు. తిరిగి మంగళవారం మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగుతాయని, సోమవారం రైతులు ఎవరూ మార్కెట్‌కు ధాన్యం తీసుకురావొద్దని సంబంధిత అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment