శిశు గృహలో వసతులను పరిశీలించిన న్యాయమూర్తి
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ, బాలసదన్, స్టేట్‌హోమ్‌లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర మంగళవారం సందర్శించారు. ఆయా హోమ్‌లలో ఉన్న నీరు, వసతి సౌకర్యాలను, అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. బాలలను పలకరించి వారి యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సరైన ఆహారం, సరైన వైద్యం అందుతుందా లేదా అని శిశుగృహ, బాలసదన్‌లో అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోమ్‌లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాలకార్మికులు, బాల్యవివాహాలు, లీగల్ సర్వీసెస్ యాక్టుల గురించి వివరించారు.
సమాజానికి విలువైనసేవలందించారు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: సీనియర్ సిటిజన్స్ సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించారని, వారి అనుభవం, జ్ఞానం ఈ తరం యువతకు మార్గదర్శంగా నిలుస్తోందని ఎస్పీ డి.జానకి అన్నారు. జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీస్‌ను సంప్రదించాలన్నారు. సమాజంలో సీని యర్ సిటిజన్లకు గౌరవం, ఆదరణ కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎస్పీని సత్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు విజయ్‌కుమార్, వరప్రసాద్, సాయిలుగౌడ్, బాలకిషన్, రాజేందర్‌రెడ్డి, ప్రభాకర్, రాజ య్య, జగపతిరావు తదితరులు పాల్గొన్నారు.
బోనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వారం రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం బోనాలతో నిరసన తెలిపారు. బస్టాండ్ వద్ద ఉన్న ఎల్లమ్మగుడిలో అమ్మవారికి బోనం సమర్పించారు. వీరి నిరసనకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి కురుమూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన న్యాయమైందన్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వీరి సమస్యను అసెంబ్లీలో చర్చించి వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి యాదగిరి, ఖాజామైనుద్దిన్, అన్వర్‌బాషా, ఈక్రమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment