అంగన్‌వాడీ కేంద్రాలను సక్రమంగా పర్యవేక్షించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అంగన్‌వాడీలు, పూర్వ ప్రాథమిక పాఠశాలను మహిళా, శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్లు పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆట, పాటలతో కూడిన విద్య, పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. అంగన్‌వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలలలో మండలం వారీగా సెక్టర్లలో పని చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించడంలో అలసత్వం వహించడంపై సీడీపీఓలను, సూపర్‌వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు. బరువు తక్కువ ఉన్న ఐదేళ్లు లోపు పిల్లలను గుర్తించి ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కు పంపించాలని, సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లోకేషన్‌తో వచ్చే ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. గర్భిణుల ఇంటికి వెళ్లి వారి గురించి అడిగి తెలుసుకోవాలని. యాప్‌లో ఎప్పటికప్పుడు డేటా అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మహిళా,శిశు, సంక్షేమ శాఖ అధికారిణి జరీనాబేగం, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment