వడ్ల డీసీఎం సీజ్
కొత్తకోట రూరల్: ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వడ్లను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న డీసీఎంను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామ సమీపంలోని ఇషాన్ ట్రేడర్స్ రైస్‌మిల్లు నుంచి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన వడ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి రైస్‌మిల్లుకు చేరుకొని వరిధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న డీసీఎంను సీజ్‌చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి ఆదేశాల మేరకు శనివారం స్థానిక తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ శనివారం ధాన్యం నిల్వలను పరిశీలించి, పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇషాన్ ట్రేడర్స్ మిల్లు వారికి 2022–23లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వానాకాలం ధాన్యాన్ని కేటాయించగా.. అట్టి ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చినట్లు తెలిపారు. అయితే 2022–23 వానాకాలానికి సంబంధించి మిల్లులో దాదాపు 4,672 బస్తాలు, గ్రామ సమీపంలోని గుట్ట వద్ద దాదాపు 13,703 బస్తాలతో కలిపి మొత్తం 18,375 బస్తాల ధాన్యం నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటుచేసిన డీసీఎంను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. రైస్‌మిల్లు యజమాని మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వ వడ్లను బయటి మార్కెట్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు.
వరిధాన్యం నిల్వను పరిశీలిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment