కొల్లాపూర్: సప్తనదీ సంగమ ప్రాంతంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరానికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో మునిగి ఉన్న ఈ ఆలయం ప్రధాన గోపురంతో పాటు సుబ్రహ్మణ్యస్వామి, నరసింహ్మస్వామి, మృత్యుంజయస్వామి, వజ్రలింగేశ్వరస్వామి, సత్యనారాయణ, సూర్యనారాయణ, గాయత్రీదేవి ఆలయాల గోపురాలు కొద్దిమేర తేలాయి. ప్రధాన ఆలయ శిఖరం వద్ద అర్చకుడు రఘురామశర్మ దేవతా చిత్రపటాలను ఏర్పాటుచేసి పూజలు చేశారు. సంగమేశ్వర ఆలయ శిఖర దర్శనానికి మరబోట్లలో భక్తులను తీసుకువచ్చే వారు గోపురాలకు దూరంగా బోట్లు తిప్పాలని అర్చకులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment