జోరుగా ఇసుక దందా
మాగనూర్: మండలంలోని పలు గ్రామాల్లో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు వడ్వాట్, అడవిసత్యావార్, మందిపల్లి, గజ్జరందొడ్డి గ్రామాల్లోని వాగుల నుంచి నిత్యం ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మాగనూర్ మండల పెద్దవాగు పరివాహక గ్రామాల్లో దందా జరుగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మాగనూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో వడ్వాట్ గ్రామ శివారులో భారీ మొత్తంలో ఇసుక దందా నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి జేసీబీ ట్రాక్టర్లతో గ్రామ శివారులో ఇసుక డంపులు చేసి తెల్లవారుజామున టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి మండలంలోని ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు.
వడ్వాట్ గ్రామ శివారులో భారీగా ఇసుక డంపులు
చోద్యం చూస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment