కల్లు సీసాలో పాము
బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లిలో కల్లుసీసాలో పాము కనిపించడం కలకలం సృష్టించింది. స్థానికులు కథనం ప్రకారం లట్టుపల్లి పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన మాన్యనాయక్ గురువారం సాయంత్రం స్థానిక కల్లు దుకాణం వద్ద కల్లు సేవించడానికి వెళ్లాడు. అతను ఓ కల్లు సీసా కొనుగోలు చేసి, తాగేందుకు సిద్ధం అవుతుండగా.. సీసాలో ఏదో ఉన్నట్లు కనిపించింది. దీంతో వెంటనే పారబోయడంతో అందులో నుంచి చనిపోయిన ఓ పాము పిల్ల బయటపడింది. దీంతో మాన్యనాయక్ దుకాణదారుడితో వాగ్వాదం చేశాడు. కాగా.. అక్కడి ఉన్నవారు సర్ది చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటనపై అబ్కారీ ఎస్సై సతీష్‌రెడ్డి వివరణ కోరగా.. ఈ విషయం ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని, తక్షణమే లట్టుపల్లి కల్లు దుకాణం వద్ద నమునా సేకరించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment