మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అని, విలువల కోసం ఎంతో పరితపించారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ధర్మాపూర్‌లోని జేపీఎన్‌సీఈలో జైపాల్‌రెడ్డి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే రంగస్థల నటులు దుప్పల్లి శ్రీరాములు, వరకవుల నరహరి రాజుకు స్ఫూర్తి అవార్డుల ప్రదానంతో పాటు రూ.25 వేల చొప్పున చెక్కు అందజేసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర కీలకమైందన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జైపాల్‌రెడ్డి నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, బలగం ఫేం మధు, సీనియర్ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, జేపీఎన్‌సీఈ చైర్మన్ కె.ఎస్.రవికుమార్, కళాశాల కార్యదర్శి వి.వెంకటరామరావు, ప్రిన్సిపాల్ డా.పి.కృష్ణమూర్తి, యువజన కాంగ్రెస్ నాయకులు అవేజ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
జేపీఎన్‌సీఈలో స్ఫూర్తి అవార్డుల ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment