యాత్రికులకు శిక్షణ శిబిరాలు
ఇస్లామిక్ సంవత్సరంలోని ‘జిల్‌హజ్జా’ మాసంలో మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అక్కడ పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై హజ్‌యాత్రికులకు అవగాహన కల్పించడానికి జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. జిల్లాకేంద్రంలో డిసెంబర్ 8న హజ్ యాత్రికులకు మెడికల్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు హజ్ సమయంలో యాత్రికులు తీసుకోవాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన జగ్రత్తలను వివరించారు. డిసెంబర్ 15న మొదటి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మతపెద్ద మౌలానా తస్లీం అన్సారీ యాత్రికులకు అవగాహన కల్పించారు. ఈఏడాది జిల్లా హజ్ సొసైటీ ద్వారా ఆరేడు శిక్షణ శిబిరాలు నిర్వహించి హజ్ యాత్ర నిష్ణాతులైన మతపెద్దలచే అవగాహన కల్పించి చివరి శిబిరంలో టీకాల క్యాంపు ఏర్పాటు చేస్తారు. రెండు శిబిరాల్లో ప్రత్యేకంగా డిజిటల్ ద్వారా ప్రాక్టికల్‌గా హజ్‌యాత్రపై అవగాహన కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment