హజ్ యాత్రకు 258 మంది ఎంపిక
స్టేషన్ మహబూబ్‌నగర్: ముస్లింలు హజ్‌యాత్ర చేయడం అనేది ఓ వరం లాంటిది. ఆర్థిక వెసులుబాటు కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్‌యాత్ర చేయాలని పవిత్ర ఖురాన్‌లో పేర్కొనబడింది. ఉమ్మడి జిల్లాలో కొన్నేళ్ల నుంచి హజ్ యాత్ర చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 258 మంది యాత్రికులు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్‌యాత్రకు వెళ్తున్నారు. మరో 90 నుంచి 100 మందికి వెయిటింగ్ లిస్టులో హజ్ యాత్ర చేయడానికి అవకాశం లభించనుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మరికొందరు వెళ్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో గతేడాది కంటే ఈసారి హజ్ యాత్రికుల సంఖ్య తగ్గింది. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా 173 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచిఅత్యధికంగా 173 మంది
యాత్రికులకు శిక్షణ శిబిరాలు ప్రారంభం
అదృష్టంగా భావిస్తున్నా
హజ్ యాత్రికులకు సేవలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ఏడాది హజ్‌యాత్రకు వెళ్తున్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. మొదటి శిక్షణ శిబిరం నిర్వహించాం. జిల్లా హజ్ సొసైటీ ద్వారా రూ పొందించిన హజ్ గైడ్‌లను యాత్రికులకు అందించాం. యాత్రపై ఎలాంటి సందేహాలున్నా మతపెద్దలను అడిగి నివృత్తి చేసుకోవాలి.
– మహమూద్ అలీ, జిల్లా హజ్‌సొసైటీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment