అర్హులైన ప్రతి నిరుపేదకూ మేలు చేకూరేలా ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ప్రతి నిరుపేదకూ మేలు చేకూరేలా ఎంపికలు

Published Fri, Jan 17 2025 12:40 AM | Last Updated on Fri, Jan 17 2025 4:12 PM

No Headline

No Headline

గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశం

‘రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల’ అమలుపై దిశానిర్దేశం

హాజరైన రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి, 5 జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘గణతంత్ర దినోత్సవం.. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి. అర్హులైన ప్రతి నిరుపేదకూ లబ్ధి చేకూరాలి’ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. 

ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశానికి ఆయన రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ముందుగా ఆయా జిల్లాల్లో పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై దామోదర సమీక్షించారు. గ్రామ, వార్డు సభలను ఎలా నిర్వహిస్తున్నారు.. అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వంటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వివరించారు. అనంతరం పథకాల సమర్థ నిర్వహణపై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి: జూపల్లి

సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగాలని, అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఆన్‌లైన్‌లో టిక్‌ చేయకపోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని చెప్పారు. వ్యవసాయ యోగ్యం కాని భూములపై పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిశితంగా సర్వే చేయాలని.. గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా సర్వే చేస్తున్నారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని.. కొత్త పథకాల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. 

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్‌ కార్డుల దరఖాస్తుల్లో వ్యత్యాసం వచ్చిందని ఉదహరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామాల్లో ఒక రోజు ముందే చాటింపు వేయించి.. గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలు, గ్రామైక్య మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఎమ్మెల్సీ కూచుకుళ్ల్ల దామోదర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రత్యేక అధికారి జి.రవినాయక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్‌ సంతోష్‌, బీఎం.సంతోష్‌, ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement