ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన దుండగులు
మరికల్: మండలంలోని పూసల్‌పహాడ్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుదర్శన్ ట్రాక్టర్‌తో వరినాట్ల కోసం కేజీ వీల్స్ ఎక్కించి పనులు చేయించాడు. వరినాట్లు ముగియడంతో బుధవారం వాటిని తొలగించి టైర్లు ఎక్కించి తన వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టర్ పెట్టాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ట్రాక్టర్‌లో ఉన్న డీజిల్‌ను తీసి దానిపై పోసి నిప్పుంటించారు. తెల్ల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు దగ్ధమైన ట్రాక్టర్‌ను చూశాడు. రూ.10లక్షల విలువ చేసే ట్రాక్టర్‌ను దగ్ధం చేసినవారిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment