ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
కోడేరు: సంక్రాంతి రైతు సంబరాల్లో భాగంగా మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పో టీల్లో 15 జతల వృషభాలు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించగా ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతపురం జిల్లా నారాయణపురం మహ్మద్ ఫరీద్ ఎద్దులు మొదటి బహుమతిగా రూ.80 వేలు, నంద్యాల జిల్లా పీఆర్‌పల్లెకు చెందిన ఎద్దులు రెండో బహుమతిగా రూ.60 వేలు, నాగర్‌కర్నూల్ జిల్లా యాదిరెడ్డిపల్లికి చెందిన అఖిలేశ్వర్‌రెడ్డి ఎద్దులు తృతీయ బహుమతిగా రూ.50 వేలు గెలుచుకున్నాయి. అలాగే అనంతపురం జిల్లా మేడుమాకులపల్లికి చెందిన తిరుపాల్‌రెడ్డి ఎద్దులు నాలుగో బహుమతిగా రూ.40 వేలు, అనంతపురం జిల్లా గార్లదిన్నెకు చెందిన రమేశ్ ఎద్దులు 5వ బహుమతిగా రూ.30 వేలు, వనపర్తి జిల్లా పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు 6వ బహుమతిగా రూ.20 వేలు, కర్నూలు జిల్లా గుడికల్‌కు చెందిన దాసు ఎద్దులు 7వ బహుమతిగా రూ.15 వేలు, నంద్యాల జిల్లా రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు ఎద్దులు 8వ బహుమతిగా రూ.10 వేలతో పాటు జ్ఞాపికలు మంత్రి జూపల్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సంక్రాంతి అంటేనే వృషభరాజుల పండుగని, సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రాంమోహన్‌రావు, జగదీశ్వర్‌రావు, రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, చలపతిరావు, మాజీ కో– ఆప్షన్‌సభ్యుడు అబ్దుల్ ఖరీం, చామంతిరాజు, తిరుపత య్య, పొండేళ్ల తిరుపతయ్య, మాజీవార్డు సభ్యులు రా జు, రామకృష్ణ, శరత్, ఇమ్రాన్, బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment