ఎలాంటి డబ్బులు రాలేదు
నా భర్త బొగ్గు చెన్నయ్య ముందు గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేసి రోడ్డు ప్రమాదంలో గతేడాది చనిపోయిండు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారి చదువులకు కష్టం అవుతుంది. పీఎఫ్ పైసలు ప్రతినెలా జీతంలో కట్ చేసుకున్నరు. కానీ, దాని నుంచి ఎలాంటి లాభం లేదు. పీఎఫ్ పైసలు వస్తే నాకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఆఫీసర్లు, ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ ఏదో ఒకటి చేసి మా సమస్య పరిష్కరించి డబ్బులు వచ్చేలా చూడాలి.
– అరుణ, జడ్చర్ల
ఫిర్యాదులు చేశాం..
పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు జీతాల్లోంచి కట్ అయినా మా ఖాతాల్లో జమ చేయలేదని మున్సిపాలిటీ నుంచి హైదరాబాద్ సీఎండీ కార్యాలయం వరకు ఫిర్యాదులు చేశాం. అనేకమార్లు ఆందోళనలు చేపట్టినం. 12 ఏళ్లుగా సమస్య మాత్రం తీరడం లేదు. అధికారులు స్పందించి మా సమస్య పరిష్కరించి మా ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. ఇప్పటి వరకు 27 మంది కార్మికులు చనిపోయారు. వారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు.
– మహేష్, అధ్యక్షుడు, మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్
కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం
కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులకు సంబంధించిన సమస్య చాలా రోజులుగా ఉంది. పీఎఫ్ నిధికి రూ.90 లక్షలు కట్టాలని ఇప్పటికే నోటీసులు వచ్చాయి. ఆ విషయాన్ని కౌన్సిల్‌లో చర్చించి డబ్బులు చెల్లింపునకు చర్యలు తీసుకంటాం. ఆ తర్వాత కార్మికుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విషయంలోనూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
– లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల
పరిష్కారానికి కృషి..
చాలా ఏళ్లుగా సమస్య తీరలేదని కార్మికులు చెబుతున్నారు. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని దాని పరిష్కారానికి కృషిచేస్తాం. కార్మికులకు అన్యాయం జరిగిందని తెలుస్తుంది. దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాం. అవసరమైతే ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాం. – పుష్పలత,
మున్సిపల్ చైర్‌పర్సన్, జడ్చర్ల
●
Comments
Please login to add a commentAdd a comment