మాట్లాడుతున్న కొప్పు బాషా
మంచిర్యాలటౌన్: రాబోయే పార్లమెంట్ ఎన్నకల్లో ఎగిరేది బీజేపీ జెండానేనని పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి కొప్పు బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో కలిసి మాట్లాడారు. ఈ నెల 23వరకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతుందని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రజనీశ్ జైన్, తులా ఆంజనేయులు, అశోక్ వర్దన్, మల్లికార్జున్, హరికృష్ణ, రమణారావు పాల్గొన్నారు.
కొనసాగుతున్న సీబీఎస్‌ఈ ‘పది’ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ (సీబీఎస్‌ఈ) పదోతరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాలకు అనుమతించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి. కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో హిందీ పరీక్షకు 34 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment