బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: మాఘ మాసం దశమి, రోహిణి నక్షత్రంతోపాటు శుక్రవారం శుభదినం కావడంతో నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ద ర్శనానికి భక్తుల భారీగా తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రా ల నుంచి భక్తులు పోటెత్తారు. వేకువ జామున అమ్మవారికి అర్చకులు అభిషేకం, అర్చన, విశేష పూజలను నిర్వహించారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు.. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. పూజల అనంతరం ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులతో అక్షర శ్రీకర పూజలు, కుంకుమ పూజలు చేయించారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రూ.12.27 లక్షల ఆదాయం..
బాసర ఆలయానికి శుక్రవారం రూ.12,27, 275 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రూ.1000 అక్షరాభ్యాసాలు 687 జరుగగా రూ.6,87,000లు, రూ.1550 అక్షరాభ్యాసాలు 300 జరుగగా, రూ.45,000, రూ.100 మండప ప్రవేశం 1,200 నిర్వహించగా, రూ.1,20,000లు, రూ.50 మండల ప్రవేశాలు 108 నిర్వహించగా రూ.5,400, రూ.100 అభిషేకం లడ్డూ ప్రసాదం 1,823 విక్రయించగా, రూ.1,82,300, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,87,575 ఆదాయం వచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment