![కారును ఢీకొన్న లారీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07mdl213r-340127_mr-1738955855-0.jpg.webp?itok=0GSSc6Bq)
కారును ఢీకొన్న లారీ
భైంసాటౌన్: పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో భైంసా–నిర్మల్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణానికి చెందిన గుజ్జుల్‌వార్ శంకర్ కారులో నిర్మల్ నుంచి వస్తూ నిర్మల్ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, బాసర నుంచి నిర్మల్‌కు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టి కొద్దిదూరం వరకు రాసుకెళ్లింది. దీంతో కారులోని శంకర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment