గుడిహత్నుర్: మండలంలోని నేషనల్ హైవే 44పై సీతాగొంది సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూకుమ్మరివాడకు చెందిన జిల్లెడ దత్తు (25), నరేశ్ ఇద్దరూ టూ వీలర్‌పై గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెఽళ్తుండగా అదే వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ నరేశ్‌ను స్థానికులు 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తిపై కేసు
కై లాస్‌నగర్: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన పీ కృష్ణాచారికి డీఆర్డీవోలో ఉద్యోగమిప్పిస్తానని ఆదిలాబాద్ పట్ట ణంలోని కొత్త కుమ్మరివాడకు చెందిన పోతిపెల్లి ప్రశాంత్ రెండేళ్ల క్రితం రూ.2లక్షలు డిమాండ్ చేసి రూ.లక్ష తీసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగమిప్పించకపోవడంతో డబ్బులైనా తిరిగివ్వాలని కృష్ణాచారి కోరగా ఇవ్వనని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
దాడి కేసులో ఒకరికి జైలు శిక్ష
దండేపల్లి: దాడి కేసులో మండలంలోని కుంటలగూడ(కట్ట)కు చెందిన ముడితే లింగయ్యకు జైలు శిక్ష విధిస్తూ లక్షెట్టిపేట కోర్టు జడ్జి అసదుల్లా షరీఫ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కుంటలగూడ(కట్ట)కు చెందిన ఏదుల రమేష్‌తో ముడితే లింగయ్య 2018అక్టోబర్ 10న గొడవపడి కర్రతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ పూర్తి కావడంతో నిందితుడు లింగయ్యకు 59రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment