క్లుప్తంగా
ఒకరి రిమాండ్
తానూరు: మండలంలోని సింగన్‌గాం గ్రామానికి చెందిన దాసర్‌వాడ్ గణేశ్ తల్లిని రాయితో గాయపర్చినందుకు శుక్రవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. సింగన్‌గాం గ్రామానికి చెందిన దాసరవాడ్ గణేశ్ అయన భార్య భాగ్యశ్రీ మధ్య గురువారం గొడవ జరిగింది. గొడవ ఆపేందుకు తల్లి కోండ్యామబాయి వెళ్లింది. గణేశ్ రాయితో భార్య బాగ్యశ్రీకి కొడుతుండగా అడ్డుకోబోయిన కోండ్యాబాయికి తలకు తగలడంతో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు ఆమెను హైదారాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. కుటుంబ సభ్యులు గురువారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం గణేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్సై రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment